
(శ్రీరామ్ చక్రి న్యూస్ ) టుడే మహేశ్వరం, జూలై 10: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకోలేవని బీజేపీ రాష్ట్ర సహకార విభాగం కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి అన్నారు.ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అప్పులు, ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని ఆరోపించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ప్రజల విశ్వాసం బీజేపీపైనే ఉందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు కాలం చెల్లిందని కోలన్ శంకర్ రెడ్డి అన్నారు.
