
హైదరాబాద్:(శ్రీరామ్ చక్రీ
న్యూస్)6-7-2026,మహేశ్వరం, న్యూస్ టుడే: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్–16, నాదర్గుల్ డివిజన్–57 పరిధిలోని అల్మాస్గూడ తిరుమల నగర్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి BLOలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, పేర్లు, చిరునామా మార్పులు, ఇతర సవరణలపై ప్రజలకు వివరించారు. ప్రతి అర్హుడైన ఓటరు గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించి ఓటరు జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత BLOలను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో BLOలు తరుణ్ గౌడ్, నిర్మల, సుస్మా, శ్రీహరి, మహేష్ పాల్గొన్నారు.స్థానికులు ధన్సింగ్ నాయక్, రమేష్ చౌహన్, శ్రీహిల్స్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, రవీందర్ రావు, బహుగుణ నాయక్ తదితరులు హాజరయ్యారు.
