
(శ్రీరామ్ చక్రీ న్యూస్) టుడే 28/6/2026 ,బాలాపూర్: ఇండియన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ (ISKO) ఆధ్వర్యంలో అన్నపూర్ణ కరాటే డోజో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ & సర్టిఫికేషన్ కార్యక్రమం ఆదివారం మల్లాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రాండ్ మాస్టర్ వి. నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమాన్ని చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ కె. శరత్ కుమార్ విజయవంతంగా నిర్వహించారు.మాజీ సర్పంచ్ బొర్రా జగన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. కరాటే ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మొత్తం 25 మంది విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు కరాటే విన్యాసాలతో ఆకట్టుకోగా, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
