
(శ్రీరామ్ చక్రీ న్యూస్) టుడే 27/6/2026
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై పూర్తి నమ్మకం కలుగుతోందన్నారు. మహేశ్వరంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన ఆయన సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు పడిందని, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్య, సాగునీరు, విద్యుత్, రైతు సంక్షేమం, గురుకులాలు, జిల్లాల అభివృద్ధి వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశామని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ విధానంలో విస్తృతంగా చేపట్టాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు.రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిత అనిల్ యాదవ్, మాజీ టెంపుల్ డైరెక్టర్ మేకల యాదగిరి, బొమ్మరబోయిన యాదగిరి, అబ్బనముని గోపి యాదవ్, బొమ్మకంటి ముదిరాజ్, కర్రే వెంకటేష్, హనుమంత్‌రావు, కేతరాజు శంకర్, ఐతరాజు వెంకటేష్, తొలుసూరి నర్సింహ యాదవ్, మద్ది యాదగిరి యాదవ్, బెల్లీ శివ యాదవ్, భూతరాజు చందు, రజినీకాంత్ ముదిరాజ్, మామిడి ప్రమోద్, సుబ్రమణ్యంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
