నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు

నిర్మల్ చైన్గేట్, జూన్ 27 : నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 28వ తేదీన గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వేస్తారు. మొదటి రోజు వేసుకోని వారికి 29,30, జూలై 1 తేదీలలో వేస్తారు. జిల్లాలో సుమారు 92,116 మంది 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు.
