గోవిందుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమల : గోవిందుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారుకాగా శుక్రవారం స్వామివారిని 74,636 మంది భక్తులు దర్శించుకోగా 43,084 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
