ఒమన్ తీరం లో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది.

ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. భారత సిబ్బందితో ఉన్న లియాకీ ఫ్రీడమ్ అనే నౌక ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా.. దాని నుంచి ఒక్కసారిగా స్పందన ఆగిపోయింది. దాంతో అమెరికా (USA) దాడి చేసిందంటూ పలు వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి.
