భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,061 ఆయా పోస్టులకు గాను 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం, : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,061 ఆయా పోస్టులకు గాను 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాదు జిల్లాలోని 11 అంగన్వాడీ ప్రాజెక్టుల్లో ఉన్న 2,061 అంగన్వాడీ కేంద్రాల్లో 185 టీచర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో అంగన్వాడీ టీచర్లపై చాలా అదనపు భారం పడుతోంది. అటు బోధనతోపాటు వంటపని కూడా చేస్తున్నారు. అదనపు పనులు చేయలేక ఇప్పటికే ఎన్నోసార్లు టీచర్లు రోడ్డెక్కారు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు
