
(శ్రీరామ్ చక్రి న్యూస్), హైదరాబాద్, జూన్ 7: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కాంగ్రెస్ శ్రేణులకు రాజకీయ పునరావాసం కల్పించడానికే ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి ఆరోపించారు.రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పదవుల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల హక్కులను కాలరాస్తోందని అన్నారు.
రైతు సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ శ్రేణుల రాజకీయ పునరావాసం కోసం తీసుకొచ్చిన నామినేటెడ్ పదవుల జీఓను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని కోలన్ శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
