
మీర్పేట్: శ్రీరామ్ చక్రి న్యూస్ 5/6/2026 ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మీర్పేట్ డివిజన్లో “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమం నిర్వహించారు. మంత్రాల చెరువు వద్ద మీర్పేట్ డివిజన్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వృక్షారోపణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ ఇంచార్జి అందేల శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, శంకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మల్లారెడ్డి, విజయలక్ష్మి రాజు, నీలా రవి నాయక్, బిక్షపతి చారి, వీర కర్ణ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
