కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అనుబంధ వాటర్ వర్క్స్ కామ్‌గార్ యూనియన్ గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలు, పీఆర్సీ ఎగ్గొట్టిందని, కాంగ్రెస్ చేస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజా వంచన పాలన అని హరీశ్‌రావు మండిపడ్డారు.
