సోషల్ మీడియా యుగంలో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, ట్రెండ్లు, తక్షణ ఫలితాలు ఇస్తాయనే వాదనలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం లేదా గట్ హెల్త్‌కు సంబంధించిన అనేక సలహాలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి

సోషల్ మీడియా యుగంలో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, ట్రెండ్లు, తక్షణ ఫలితాలు ఇస్తాయనే వాదనలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం లేదా గట్ హెల్త్‌కు సంబంధించిన అనేక సలహాలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో ప్రతి ట్రెండ్‌కు శాస్త్రీయ ఆధారాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం పొందుతున్న కొన్ని గట్ హెల్త్ ట్రెండ్లు వాస్తవానికి ప్రయోజనాల కంటే సమస్యలను ఎక్కువగా కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది ఫైబర్ మ్యాక్సింగ్ పేరుతో ఒకేసారి అధిక మొత్తంలో ఫైబర్ తీసుకోవడం ప్రారంభిస్తున్నారు.
