తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ కోటలోని ఖుష్‌మహల్ మైదానంలో మంత్రి కొండా సురేఖ, ములుగులో మంత్రి సీతక్క, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ విప్‌లు రామచంద్రూనాయక్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
