నగరవాసులకు ఆహ్లాదం అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్‌బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉన్నదని, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏమాత్రం స్పందించలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఖలీల్‌వాడి, జూన్ 1 : నగరవాసులకు ఆహ్లాదం అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్‌బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉన్నదని, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఏమాత్రం స్పందించలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నిరోజులుగా సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే మీడియాలో వచ్చిన వార్తలను కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గమనించిన బిగాల గణేశ్‌గుప్తా స్వయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు.
