అమెరికా (USA) లో శాశ్వత నివాస హక్కు (Green Card) నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్ (US) ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS)’ తాజాగా వెల్లడించింది.

Green Card : అమెరికా (USA) లో శాశ్వత నివాస హక్కు (Green Card) నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్ (US) ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS)’ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్ఎస్ వివరణ ఇచ్చింది.
