
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌కు చెందిన ‘ట్యుటారా’ అనే వింతయిన బల్లిలాంటి జీవిని దగ్గరగా చూస్తే మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. అదే.. పని చేసే మూడో కన్ను. ట్యుటారా తలకు ఇరువైపులా ఉండే ప్రధాన కండ్లలాగే ఈ మూడో కన్ను కూడా లెన్స్, రెటీనా, మెదడుకు అనుసంధానించబడిన నరాలను కలిగి ఉంటుంది. సరీసృపం వంటి వెన్నెముక ఉన్న జీవికి ఇంతటి అధునాతనమైన మూడో కన్ను ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ నిజం ఏమిటంటే మానవులకూ అలాంటిది ఒకటి ఉంది. ‘పీనియల్ గ్రంథి’ అని పిలిచే ఈ కన్ను పుర్రె కింద మెదడు లోపల లోతుగా దాగి ఉంటుంది. నేరుగా సూర్యకాంతి తగలకుండా ఉన్నప్పటికీ కాంతి, చీకట్లకు మన శరీరం ఎలా స్పందించాలో నిర్దేశించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నది
