మల్కాజిగిరి సీపీ సుమతి పేరుతో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. ఫర్నీచర్ అమ్ముతామని నమ్మించి రూ.20వేలు కొట్టేశారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేరు, ఫొటోతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ఖాతాను తెరిచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. రామంతాపూర్‌కు చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తనకు పోలీస్ కమిషనరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారని భావించిన బాధితుడు రిక్వెస్ట్‌కు ఒకే చెప్పాడు. రెండు రోజుల తరువాత బాధితుడి వాట్సాప్ నెంబర్‌కు తాను ఐపీఎస్ అధికారి సుమతి అంటూ మేసేజ్ వచ్చింది.
