ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు నీటికోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
