సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సిరిసిల్ల టౌన్, మే 29: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబానికి ఆయన భరోసా కల్పించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
