కొందరు రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

సుబేదారి, మే 27 : కొందరు రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేసి, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారికే వంతపాడుతున్నారు. సెటిల్మెంట్లలో నీకింత.. నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు.
