తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఇకమీదట రైతులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులే. అవి అట్లాంటి.. ఇట్లాంటివి కాదు. ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నది. పోలీసులను ఉసిగొలిపి అన్నదాల నోళ్లు మూయించేందుకు వ్యూహరచన చేసిం ది

‘ప్రభుత్వం వెంటనే తమ వడ్లు కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేసిన పాపానికి గాలి సడవలి, మానెం రాజబాబు, కొండపర్తి రవి, కొండగొర్ల వెంకటస్వామి, రామిల్ల రాజబాపు, మాడెం రవి, కొండ తిరుపతి, బొమ్మ తిరుపతిరెడ్డిపై రేవంత్ సర్కార్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఈ 8 మంది రైతులు ‘రోడ్డుపై వాహనాలను అడ్డగించి, ప్రజాశాంతికి భంగం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినారు. వారు సుమారు అరగంట వరకు ప్రజా రవాణాను స్తంభింపజేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినారు’ అని రైతులపై అభియోగం మోపారు.
