ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు

వరంగల్ చౌరస్తా, మే 25 : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దవాఖాన అత్యవసర (క్యాజువాలిటీ) విభాగానికి నిత్యం పదుల సంఖ్యలో మెడికో లీగల్ కేసులు వస్తుంటాయి. వీటిని నమోదు చేసిన సందర్భంలో కేసుకు సంబంధించిన సమాచారం, బాధితుడు లేదా క్షతగాత్రుడి వివరాలు, హాస్పిటల్కు చేరిన సమయంలో రోగి ఆరోగ్యస్థితి తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
