రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుతున్నారు

తొర్రూరు, మే 25: రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రవాణా వాహన టారిఫ్‌లో సగం మాత్రమే చెల్లిస్తూ తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ హబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 31, ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
