కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింపడానికి గోనె సంచులు లేవు. లారీల్లో వేయడానికి హమాలీలు లేరు. ఇన్నీ సమస్యలతో మేమెట్టా వ్యవసాయం చేసేది.

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ చౌరస్తా వద్ద మండటెండలో లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట్ మూడు గ్రామాల రైతులు నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కడెం మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాక ధాన్యం తూకం వేయకపోవడం, తూకం వేసిన ధాన్యాన్ని నెల రోజులైన తరలించకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటలకు పైగా ప్రధాన రహదరిపై రైతులు బైఠాయించారు
