కేంద్రంలోని బీజేపీ సర్కార్ దన్నుతోనే ఏపీ సర్కార్ గోదావరి-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్నది. అవార్డులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టేందుకు సిద్ధమైంది. అందుకు కేంద్ర సర్కార్ విధానాలూ దోహదం చేస్తున్నాయి.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ దన్నుతోనే ఏపీ సర్కార్ గోదావరి-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై దూకుడుగా వెళ్తున్నది. అవార్డులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి హక్కులకు గండికొట్టేందుకు సిద్ధమైంది. అందుకు కేంద్ర సర్కార్ విధానాలూ దోహదం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడంతోపాటు ఆర్థిక సాయం అడిగిందే తడవుగా కేంద్రం స్పందించింది. ప్రాజెక్టుపై అధ్యయనానికి వెంటనే పూనుకున్న ది. ఏపీ సీఎం లేఖను సీడబ్ల్యూసీకి పంపింది. దీనికి సీడబ్ల్యూసీ సైతం వెంటనే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాసింది. ఏపీ ప్రతిపాదించిన జీబీ లింక్ ప్రాజెక్టుపై తదుపరి చర్య లు చేపట్టేందుకు సమగ్ర వివరాలు, అభిప్రాయాలు తెలియజేయాలని హుకుం జారీ చేసిం ది. ఆయా సంస్థలు ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
