ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి మిస్సింగ్ కేసు నమోదు కాగా, ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో సదరు వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం..

మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భార్య సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టగా, మనూరు మండలం ఎల్గోయికి చెందిన పండరి అనే వ్యక్తితో ఫోన్లో పలుసార్లు మాట్లాడినట్టు తేలింది. దీంతో పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, ముత్యంరెడ్డిని తానే హత్య చేసి తన వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టినట్లు పండరి అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు పండరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో భాగంగా పండరికి సహకరించిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.హత్యకేసు విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం ఎల్గోయిలోని నిందితుడు పండరి వ్యవసాయ భూమిలో పూడ్చిన పెట్టిన ముత్యంరెడ్డి మృతదేహానికి మనూరు తహసీల్దార్ విష్ణుసాగర్ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.
