నారాయణపేట జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఊట్కూర్, మే 24 : నారాయణపేట జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మూడేండ్లుగా ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై ప్రజలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న చోట సహాయకులే కేంద్రాలు నిర్వహిస్తున్నారు
