అసలే ఎండాకాలం… కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో మందుబాబులు దూప తీర్చుకోవడానికి బీర్లు తెగ తాగేస్తుండంతో డిమాండ్ పెరిగింది.

చేర్యాల, మే 23: అసలే ఎండాకాలం… కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో మందుబాబులు దూప తీర్చుకోవడానికి బీర్లు తెగ తాగేస్తుండంతో డిమాండ్ పెరిగింది. సిద్దిపేట జిల్లాలో 93 మద్యం షాపులు, 15 బార్లు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో 3,46,659 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి మే 21వ తేదీ వరకు 5,14,274 కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు సిద్దిపేట మద్యం డిపో రికార్డులు చెబుతున్నాయి. జిల్లా మద్యం డిపో నుంచి సిరిసిల్లకు సైతం మద్యం సరఫరా అవుతున్నది.
