మండుతున్న ఎండలు సరస్వతీ నది అంత్య పుష్కర భక్తులపై ప్రతాపం చూపుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి జం కుతున్నారు. ఎండ తీవ్రత 45, 46 డిగ్రీలు దాటుతుండడంతో జనం తట్టుకోలేకపోతున్నారు.

మహదేవపూర్: మండుతున్న ఎండలు సరస్వతీ నది అంత్య పుష్కర భక్తులపై ప్రతాపం చూపుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి జం కుతున్నారు. ఎండ తీవ్రత 45, 46 డిగ్రీలు దాటుతుండడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతున్న ఎండ వేడి సాయంత్రం ఆరు దాటినా తగ్గడం లేదు. మరోవైపు వడదెబ్బతో ప్రజలు అస్వస్థతకు గురికావడం, మృతి చెందే ఘటనలు జరుగుతుండడంతో ఆ ప్రభావం పుష్కరాలపై పడుతున్నది.
