సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

సూర్యాపేట జిల్లా, ; సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోనే హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేసి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో యర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
