కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భూ హారతి ద్వారా కేసముద్రంలో అసైన్డ్ పట్టాలు ఆక్రమించాడని ఆరోపించారు. శంషాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు 90 ఎకరాల సీలింగ్ భూమిని తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూమిని దోపిడీ ఎలా చేశారో ఏసీబీ దాడిలో దొరికారు. అయినా కూడా ఇలాంటి వాటిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడని విమర్శించారు.
