మెంటల్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఆందోళన, నిరాశతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది

న్యూఢిల్లీ: ద లాన్సెట్ జర్నల్ సంచలన నివేదికను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక వైకల్యం కేసులు పెరుగుతున్నట్లు ఆ రిపోర్టులో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. 1990 నుంచి మానసిక రుగ్మతకు చెందిన కేసులు సంఖ్య రెట్టింపు అయినట్లు ద లాన్సెట్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న గుండె, క్యాన్సర్, నరాల సంబంధిత కేసుల కన్నా ఎక్కువ సంఖ్యలో మానసిక వైకల్యం కేసులు ఉన్నట్లు ఆ రిపోర్టులో చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్, క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ రీసర్చ్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు ఈ రిపోర్టును తయారు చేశారు.
