కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్యార్డుతో ప్రజలు పడుతున్న నరకయాతన, ఆవేదన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు

డంపింగ్ యార్డుపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు మూడు కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్యార్డుతో ప్రజలు పడుతున్న నరకయాతన, ఆవేదన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. అన్ని పార్టీల నేతలు సమస్యలపై అధికారులను నిలదీశారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యలకు సీఎం శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ అంశంపై లేవనెత్తగా, దాదాపుగా ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రధాన ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం నేతలు కూడా డంపింగ్ యార్డు అంశంలో తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. రాంకీ సంస్థ డంపింగ్ యార్డులో తీసుకోవాల్సిన ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని, పరిసర ప్రాంతాల వారికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ పరిధిలోని పలు సమస్యలను ప్రస్తావించిన ప్రజాప్రతినిధులు, నాయ
