
హైదరాబాద్ న్యూస్ : శ్రీరామ్ చక్రి న్యూస్ ఈరోజు వార్త జిల్లెలగూడ, మే 8: మే 10న జరగనున్న నరేంద్ర మోదీ గారి బహిరంగ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ జిల్లెలగూడ లేక్ పార్క్ (చందన చెరువు) వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి అందెల శ్రీ రాములు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, అలాగే “ఆపరేషన్ సిందూర్” తర్వాత తెలంగాణకు రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. “సబ్కా సాథ్ – సబ్కా వికాస్” నినాదంతో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న మోదీ గారి సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు సుల ప్రభాకర్, మాజీ కార్పొరేటర్లు మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, గౌరీశంకర్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, మేకల రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సిద్దాల శ్రీనివాస్, కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జనరల్ సెక్రటరీ గాజుల మధు, గడ్డం జగన్, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, తుమ్మల రమేష్, గోపీనాథ్, మల్లేష్, ఎడ్ల మల్లేష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, రఘు, శ్రీశైలం యాదవ్, వంటేరు నరసింహ రెడ్డి, మల్లికార్జున్, రజిని రాజ్పుత్, హైందవి రెడ్డి, గీత, మల్లారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, ఉదయ్, నాగేశ్వర్ రావు, భాస్కర్, అనంత్ రెడ్డి, ఆనంద్, మహేష్, ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
