నాగర్‌కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు.

నాగర్‌కర్నూ ల్, మే 6 : నాగర్‌కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో ఇండ్ల లో ఉండలేక, బయటకు వెళ్లలేక బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళితే వడగాలుల తాకిడికి గురయ్యే పరిస్థితులు ఉండడంతో అత్యవసరం పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
