కాంగ్రెస్ నాయకులు మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్లగొండ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ధాన్యం ఎంత వస్తే అంత కొనుగోలు చేశారని, కానీ నేడు కాంగ్రెస్ నాయకులు మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆర్జాల బావి, ఎస్ఎల్ బి సి, దండంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ధాన్యం తీసుకువచ్చి నెల అయినా ఇంకా తూకం వేయడం లేదని, కొర్రీలు పెడుతున్నారని తమను అన్ని విధాలుగా మోసం చేసి దోచుకుంటున్నారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
