వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది.

ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని చేస్తున్న రిలే దీక్షలకు అనుమతి ఇవ్వాలని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామ రైతులు పరిగి పోలీస్ స్టేషన్‌ను మెట్లు ఎక్కారు. కానీ ఈ దీక్షలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వస్తుండటంతో అనుమతి నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే పలువురు రైతులు బైఠాయించారు. ఈ క్రమంలో మీ కాళ్లు మొక్కుతాం.. పర్మిషన్ ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ల మీద పడి మహిళా రైతులు వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరిండంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు
