ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ స్పృహలో లేనట్లు తెలిసింది. కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ కథనంలో పేర్కొన్నారు.

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ స్పృహలో లేనట్లు తెలిసింది. తీవ్రమైన వైద్య సమస్యతో ఆయన ఇబ్బందిపడుతున్నాడు. ఇరాన్‌లోని కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ కథనంలో పేర్కొన్నారు. దేశాన్ని ఆయన పాలించలేకపోతున్నట్లు ఆ రిపోర్టులో చెప్పారు. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం మొజ్తాబాకు రహస్య ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. కోమ్ నగరంలో మొజ్తాబాకు చికిత్స అందిస్తున్న విషయాన్ని తొలిసారి ఇరాన్ బహిరంగంగా అంగీకరించింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న మొజ్తాబా .. ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోవడం లేదని ఆ రిపోర్టులో చెప్పారు.
