బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్‌రావు గృహ నిర్బంధం అక్రమమని మండిపడ్డారు.

అధికారం చేతిలో ఉందని ఈ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూముల చెరబడుతున్నదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు .. ఒక్క ఇటుక పేర్చింది లేదని విమర్శించారు. కానీ భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం సిగ్గు చేటు అని విమర్శించారు
