బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు, హౌస్ అరెస్టులపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తే అక్రమ అరెస్టులా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొందన లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.
