మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపా రం, తయారీ రంగం ఉంది. సుమారు 20వేల మంది చేనేత కార్మికులు ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి, పుట్టపాక, నారాయణపురం, ఆలే రు, యాదగిరిగుట్ట, మోత్కూరు, భువనగిరి, కొయ్యలగూడెం తదితర ప్రాంతాల్లో చీరలు అధికంగా నేస్తారు. జిల్లాలో 43 సొసైటీలు ఉండగా, వేలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మికులు మగ్గాల ఏర్పాటుకు, ఉత్పత్తికి ముడి సరుకు కొనుగోలు కోసం రుణాలు తీసుకుంటారు. ఇందులో అధిక భాగం కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకుల ద్వారా పొందుతారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న వారే అర్హులుగా గుర్తించారు. ఎంత రుణం తీసుకున్నా లక్ష మాత్రమే మాఫీ అవుతుంది. రూ. లక్షకు మించి రుణం ఉన్నా రూ.లక్ష వరకు మాత్రమే క్లియర్ చేస్తారు. బ్యాంకుల ఒత్తిడి మేరకు కొందరు బయట అప్పు చేసి
