సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి.

తిరుమల : సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.
