సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తెపైనా రోకలి బండతో దాడి చేశాడు.

సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తెపైనా రోకలి బండతో దాడి చేశాడు. సిద్దిపేట పట్టణంలోని ఆదర్శనగర్లో నివాసం ఉంటున్న ఎల్లయ్యకు అతని భార్య శ్రీలత (40)కి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ కుటుంబ కలహాల కారణంగా ఆగ్రహానికి గురైన ఎల్లయ్య శ్రీలత గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తె అర్చనపైనా రోకలి బండతో దాడి చేశాడు. క్షణికావేశంతో భార్యను హత్య చేసినప్పటికీ.. ఆ తర్వాత భయపడిపోయిన ఎల్లయ్య తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించా
