మక్తల్, జనవరి 16; రాజకీయం పేరుతో జూదం రాజ్యమేలడం, కాంగ్రెస్ నేతలు నిషేధిత కోడిపందాలు నిర్వహించిన సంఘటన మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

మక్తల్, జనవరి 16; రాజకీయం పేరుతో జూదం రాజ్యమేలడం, కాంగ్రెస్ నేతలు నిషేధిత కోడిపందాలు నిర్వహించిన సంఘటన మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజులపాటు మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నిషేధిత కోడిపందాలను భారీ స్థాయిలో పోటీలు నిర్వహించి, పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ప్రజలకు చట్టాలు పాటించాలని ఉపన్యాసాలు ఇచ్చే నేతలే, తెర వెనుక నిషేధిత జూదానికి అండగా నిలవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోందని మండల ప్రజలు వాపోతున్నారు.
