ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు.

ఖమ్మం రూరల్, జనవరి 16 : ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. కావున వాహన ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపును దృష్టిలో పెట్టుకుని పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిందిగా ఆయన సూచించారు.
