
జనవరి:16(శ్రీరామ్ చక్రం న్యూస్)మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలం, జిల్లెలగూడలో ఉన్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం గోశాలలో కనుము పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వర రావు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,గోమాతను పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు. గోవును భక్తితో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి” అని భక్తులకు సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ గురు స్వామి, శివ స్వామి మహేష్ గురు స్వామి, శివ స్వాములు, రచ్చ వెంకటేష్ శివ స్వామి, జంగయ్య శివ స్వామి, విజయ్ కుమార్, మైపాల్ రెడ్డి, సాయి రెడ్డి, రాయుడు తదితరులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గోవుల పూజలో పాల్గొని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు.
