ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చుతూ సీఎం హోదాలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతంతో ఆశీర్వదించి నంబర్ వన్‌గా నిలబెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే చేయండి.. మంత్రులతో పని చేయించుకునే వాళ్లను గెలిపించాలి. రూ. 10కి ఆశపడి ఓటేస్తే వాడు రూ. 100 కొల్లగొడతాడు’ అంటూ ఓటర్లకు పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘నేను వాళ్లను గెలిపించండి, వీళ్లను గెలిపించండి అని చెప్పడం లేదు.. కానీ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని గెలిపించండి’ అంటూ అచ్చంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల ముందు ఎలా మాట్లాడారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు కూడా అలానే మాట్లాడారు. ‘తొందర్లోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతయి. టీవీలు, పేపర్లలో వస్తుంది. మంచోన్ని, మనోన్ని గెలిపించుకోవాలి’ అని చెప్పారు.
