
జనవరి 11( శ్రీరామ్ చక్రిన్ న్యూస్)
ఇండియన్ పాఠశాల జిల్లెలగూడ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ భవాని దత్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది, ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం మరియు పంటల పండుగ, ఇందులో భోగి, సంక్రాంతి, కనుమ ముఖ్యమైన రోజులు, రైతులు తమ పశువులతో అనుబంధాన్ని పంచుకుంటారు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త బియ్యంతో పొంగలి, గాలిపటాలు ఎగురవేయడం వంటివి సంప్రదాయాలు అని పేర్కొన్నారు. రంగోలి పోటీలో పాల్గొన్న విద్యార్థులకు వారి తల్లితండ్రులకు బహుమతులు అందచేశారు మరియు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేశారు.
