శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా గుండారం రిజర్వాయర్ కు వెళ్లే డీ-83 ఎస్ఆర్ ఎస్పీ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో శుక్రవారం కొన్నిగంటలపాటు పరవళ్లు తొక్కింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిమితి 700 క్యూసెక్కులే అయినప్పటికీ పైన ఏం జరిగిందో ఏమోగాని డీ-83 కాలువలో నీటి ప్రవాహం భారీ స్థాయిలో పెరిగింది.

పెద్దపల్లి రూరల్, జనవరి 2 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా గుండారం రిజర్వాయర్ కు వెళ్లే డీ-83 ఎస్ఆర్ ఎస్పీ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటితో శుక్రవారం కొన్నిగంటలపాటు పరవళ్లు తొక్కింది. ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిమితి 700 క్యూసెక్కులే అయినప్పటికీ పైన ఏం జరిగిందో ఏమోగాని డీ-83 కాలువలో నీటి ప్రవాహం భారీ స్థాయిలో పెరిగింది. దీంతో కొన్ని గంటలపాటు ప్రజలు, రైతులను భయబ్రాంతులకు గురిచేసింది. కాల్వ పరిమితి 700 క్యూసెక్కులే అయిన 850 క్యూసెక్కుల నీటి ప్రవాహం జరుగుతోంది.
