రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు

మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
